- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విరిగిపడిన కొండచరియలు.. చిక్కుపోయిన మానస సరోవరం యాత్రికులు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిథోర్‌గఢ్ జిల్లాలో మంగళవారం భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని (Uttarakhand) పిథోర్‌గఢ్ (Pithoragarh) జిల్లాలో మంగళవారం భారీగా కొండ చరియలు (Landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటన కైలాస్ మానస సరోవరం యాత్ర ప్రధాన మార్గంలో చోటుచేసుకోవటంతో వందలాది మంది యాత్రికులు (Pilgrims) అక్కడ చిక్కుకుపోయారు. కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే పర్వత ప్రాంతం కావడంతో సహాయం అందించడంలో సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. విపత్తు నిర్వహణ బృందాలు యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించి రోడ్డు పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కొండచరియలు విరిగిపడటంతో మార్గం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో కైలాస్ యాత్రను తాత్కలికంగా నిలిపివేశారు. కాగా, ఈ ప్రాంతంలో తరచూగా కొండచరియలు విరిగిపడుతుంటాయి.






