- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విరిగిపడిన కొండచరియలు.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. దీంతో ఆకస్మీక వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తోన్నాయి. దీంతో ఆకస్మీక వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వరదల కారణంగా అమర్‌నాథ్ (Amarnath Yatra) యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 10 మందికి గాయాలయ్యాయి. దీంతో అధికారులు తాత్కాలికంగా అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. యాత్రికుల భద్రత కోసం ముందస్తు చర్యగా యాత్రను నిలిపివేసినట్లు తెలిపారు.
కాగా, జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. 3,800 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించి, సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. ఆగస్టు 19న ముగుస్తుంది. గత ఏడాది 4.5 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకుని ప్రార్థనలు చేశారు.






