Kumbha Mela: చివరి దశకు కుంభమేళా.. మరోసారి ఆంక్షలు

by Yella Dhawani Reddy |

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela) చివరి దశకు చేరుకుంది.

Kumbha Mela: చివరి దశకు కుంభమేళా.. మరోసారి ఆంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela) చివరి దశకు చేరుకుంది.జనవరి 13న ప్రారంభమైన ఈ వేడుక.. రేపటి (ఫిబ్రవరి 26)తో ముగియనుంది. అయితే, మహా శివరాత్రి (Maha Shivaratri), చివరి రోజు కావటంతో కుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యూపీ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి కుంభమేళాలో ఆంక్షలు విధించారు.

ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా (No Vehicle Zone) ప్రకటిస్తున్నట్లు అధికారులు చెప్పారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఆంక్షలు ప్రయాగ్‌రాజ్‌ మొత్తం అమల్లో ఉంటాయన్నారు. స్థానికుల కోసం నిత్యావసరాలు తీసుకొచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ప్రజలకు ఉచిత ఆహార, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు తమ సమీపంలోని ఘాట్‌లలోనే పుణ్యస్నానాలు ఆచరించాలని సూచించారు. ఇక ఇప్పటివరకు పవిత్ర త్రివేణి సంగమంలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Next Story