Kanchi Kamakshi : కంచి కామాక్షికి బంగారు వీణ !

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-13 05:31:05.0  )
Kanchi Kamakshi : కంచి కామాక్షికి బంగారు వీణ !
X

దిశ, వెబ్ డెస్క్ : అష్టాదశ శక్తిపీఠాల్లో కాంచీపుర కామాక్షీ దేవి(Kanchi Kamakshi)శక్తిపీఠం రెండవది. కాంచీపురంలో కొలువైన కామాక్షి అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చే మహాశక్తి ప్రదాయినిగా భక్తులు కొలుస్తారు. చల్లని తల్లి కామాక్షి అమ్మవారికి ఓ భక్తుడు బంగారు పూత పూసిన వీణ(Golden Veena)ను బహుకరించారు. నీరజా విజయకుమార్ కుటుంబం రాగితో తయారు చేయించిన 10 కిలోల వీణకు బంగారం పూత పూయించి అమ్మవారికి బహుకరించారు.

కాంచీపురం మోక్షదాయకమైన పట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి. కామాక్షీ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో పల్లవ రాజవంశ రాజులు నిర్మించారని చారిత్రాక కథనం. ఆలయంలో అమ్మవారు యోగముద్రలో పద్మాసనముపై కూర్చుని తన చేతులలో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకుగడలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపంలో దర్శనం చేసుకునే అమ్మవారిని దర్శించుకునే వారికి శాంతి సౌభాగ్యాలు, కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. కంచిలోని శక్తి పిఠాన్ని నాభిస్థాన శక్తి పీఠం అంటారు. కామాక్షిలో క అంటే సరస్వతి రూపం..మా అంటే లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను...అని..అమ్మవారు సరస్వతిగా, లక్ష్మిగా రెండు కన్నులతో దర్శనమిస్తుందని స్థలపురాణం.

Advertisement
Next Story