- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్వాలాముఖి యోగం 2025.. ఈ నాలుగు రాశులవారికి అష్టకష్టాలు
జ్వాలాముఖి యోగం.. జ్యోతిష్యశాస్త్రంలో దీనిని ప్రమాదకరమైన, ప్రమాదాలకు గురిచేసే యోగంగా పరిగణిస్తారు.

దిశ, వెబ్‌డెస్క్: జ్వాలాముఖి యోగం.. జ్యోతిష్యశాస్త్రంలో దీనిని ప్రమాదకరమైన, ప్రమాదాలకు గురిచేసే యోగంగా పరిగణిస్తారు. సూర్యుడు, కుజుడు, రాహువు లేదా కేువు గ్రహాలు చంద్రుని నుంచి 2 లేదా 12 ఇంట్లో ఉన్న సమయంలో జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడే తిథి, మూలనక్షత్రం కలయిక నేడు ఉండటంతో.. నేడే జ్వాలాముఖి యోగం ఏర్పడుతుందని పండితులు పేర్కొన్నారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాు చేపట్టకూడదని, అది దురదృష్టకర ఫలితాలకు దారితీస్తుందని సూచించారు. ఈ జ్వాలాముఖి యోగం కారణంగా నాలుగు రాశులవారికి అష్టకష్టాలు మొదలవుతాయని చెప్తున్నారు.
మేషరాశి
ఈ యోగం సమయంలో మేషరాశి వారి ఆదాయం స్థిరంగా ఉన్నా.. ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. కోపంతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను కలిగించవచ్చు. లాభాల కోసం తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిదికాదు. స్నేహితులు, బంధువులకు డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.
మిథున రాశి
ఈ రాశివారు ఇల్లు, కారు, ఇతర విలాసాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. విలాసవంతమైన వస్తువుల్ని కొనడం వల్ల పొదుపుపై ప్రభావం చూపుతుంది. ఖర్చుల్ని నియంత్రించుకోకుండా నెలాఖరు నాటికి డబ్బు కొరత ఏర్పడవచ్చు. ఆకస్మికంగా ఆర్థిక హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది.
తులారాశి
భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థికంగా నష్టాలను కలిగించే అవకాశం ఉంది. కుటుంబానికి, ప్రియమైనవారికి సహాయం చేయడం వల్ల ఆర్థిక పరిమితుల్ని మరిచిపోతారు. ఇది కొత్త కష్టాలను తీసుకొస్తుంది. పాత అప్పులు, పెండింగ్ నిధుల గురించి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించిన వివాదాలు కూడా ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయి.
కుంభరాశి
ఈ రాశివారికి కొత్త సంపాదన అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. ఉద్యోగాలు మారే ముందు అదనపు ఆదాయాన్ని పొందే ముందు, కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమచారాన్ని సేకరించడం ముఖ్యం. ఇది ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. పాత అప్పుల ఒత్తిడి పెరగవచ్చు.






