- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akhanda Deepam: అఖండ దీపం వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందా .. ఎప్పుడు వెలిగిస్తారంటే..?
మనం రోజూ చిన్న దీపాలలో వెలిగిస్తాం అది కొంత సమయనికే కొండెక్కితోంది.

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా భారతదేశంలో పూజలు ఎక్కువగా చేస్తుంటారు. ఇక్కడ అనేక మతాలు వారు నివసిస్తున్నారు. ఇండియాలో ఏ టెంపుల్ కి వెళ్లిన దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే, గుళ్లలో ఒక్కోసారి అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు వెలిగిస్తారో చాలా మందికి తెలియదు. దీని వెనుక ఉన్న రహస్యం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
మనం రోజూ వెలిగించే దీపం రెండు నుంచి మూడు గంటల వరకు ఉంటుంది. కానీ, ఈ దీపం అలా కాదు .. వెలుగుతూనే ఉంటుంది. అసలు, అఖండము అంటే ఖండము లేనిది. ఈరోజు మనం ఏ సమయానికి వెలిగిస్తామో మరుసటి రోజు మళ్లీ అదే సమయం వరకు వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపాన్నే " అఖండ దీపం " అని పిలుస్తారు. అందుకే , అఖండ దీపాలను ప్రమిదల్లో కాకుండా పెద్ద మట్టి పాత్రలో వెలిగిస్తుంటారు. ఆ పాత్రను తీసుకొని దాన్ని నీటిలో నానబెట్టి, ఆ తర్వాత తుడిచి దానిలో నువ్వుల నూనె పోసి పెద్ద వత్తి వేసి వెలిగిస్తుంటారు.
మనం ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో వెలిగిస్తే రేపటి బ్రహ్మముహూర్తం వెలుగుతూనే ఉంటుంది. మనం రోజూ చిన్న దీపాలలో వెలిగిస్తాం అది కొంత సమయనికే కొండెక్కితోంది. కానీ, అఖండంగా వెలిగే దీపాన్ని అఖండ దీపంగా పిలుస్తారు. ఇళ్ళలో వ్రతాలు, నోములు , దేవాలయాల్లో హోమాలు చేసేటప్పుడు ఈ దీపాలు కచ్చితంగా వెలిగిస్తూ వుంటారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






