- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Lunar Eclipse: 2025లో తొలి చంద్రగ్రహణం శుభమా.. అశుభమా?.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే..?
గ్రహాల ప్రభావం మనిషి పై ఎలా ఉంటుందో.. గ్రహణాల ప్రభావం కూడా అలాగే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు

దిశ, వెబ్ డెస్క్ : హిందూ పురాణాల ప్రకారం, గ్రహణాలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యగ్రహణం కంటే చంద్రగ్రహణమే ఎక్కువ ప్రభావం చూపుతుందని పురాణాల్లో చెబుతున్నారు. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన పౌర్ణమి రోజున జరుగుతుంది. అదే సూర్య గ్రహణం అయితే నిండు అమావాస్య రోజున ఏర్పడుతుంది.
2025 ఏడాదిలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. గ్రహాల ప్రభావం మనిషి పై ఎలా ఉంటుందో.. గ్రహణాల ప్రభావం కూడా అలాగే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో చంద్రగ్రహణం పాల్గొనమాసం పౌర్ణమి అంటే మార్చి 14వ తేదీన సంభవించబోతోంది. ఇది ఈ ఏడాదిలో వచ్చే మొదటి చంద్రగ్రహణం.
చంద్రగ్రహణం సమయం : ఉదయం 9:29 నిమిషాల నుంచి సాయంత్రం 03:00 గంటల వరకు ఈ చంద్రగ్రహణం కొనసాగుతుంది.
అయితే, ఈ సారి ఏర్పడే చంద్రగ్రహణం శుభంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు, ఎవరి మీద ఎలాంటి ప్రభావం ఉండదట. అంతేకాకుండా, గ్రహణం పడుతున్న అన్ని పనులు చేసుకోవచ్చని చెబుతున్నారు.






