తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-15 02:26:51  IST  )

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కాస్త పెరిగింది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కాస్త పెరిగింది.బుధవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఓ మోస్తరుగా తరలి వచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 3 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 14 కంపార్ట్‌మెంట్లు భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. బుధవారం స్వామి వారిని 74,020 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 31,190 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.27 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Next Story