- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
by Yella Dhawani Reddy |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత నెల రోజులుగా తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు రద్దీ మరింత పెరిగింది. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. కాగా శనివారం కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో.. నిన్న స్వామివారిని 91,720 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 44,678 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తుల కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.80 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
Next Story






