- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైకుంఠ ఏకాదశి.. ఉపవాసం అంటే నిరాహారం మాత్రమే కాదు.. నియమాలివే
వైకుంఠ ఏకాదశిరోజున ఉపవాసం చేసి, ద్వాదశిన అతిథి లేకుండా భోజనం చేయకూడదంటారు. అలా చేస్తే ఉపవాసం చేసిన ఫలితం దక్కదంటారు.

దిశ, వెబ్‌డెస్క్: వైకుంఠ ఏకాదశి.. ఈ రోజున విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వస్తారని, వైకుంఠ ద్వారం నుంచి ఆయన్ను దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని నమ్మకం. అందుకే విష్ణు ఆలయాలన్నీ ఈరోజున భక్తులతో కిటకిటలాడుతుంటాయి. వైకుంఠ ఏకాదశిరోజున ఉపవాసం చేసి, ద్వాదశిన అతిథి లేకుండా భోజనం చేయకూడదంటారు. అలా చేస్తే ఏకాదశిరోజున ఉపవాసం చేసిన ఫలితం దక్కదంటారు. ఇక్కడ ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. జీర్ణాశయానికి విశ్రాంతి లభిస్తుంది. అలాగని ఉపవాసం అంటే నిరాహారంగా ఉండటం మాత్రమే కాదు.
ఉప అంటే దగ్గరగా.. వాసం ఉంటే ఉండటం.. ఉపవాసం అంటే అర్థం దైవానికి దగ్గరగా ఉండటం. ఈరోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని, అందుకే వాటితో చేసిన ఆహారాలను తినకూడదని పెద్దలు చెప్తారు. అన్నం లేదా బియ్యంతో చేసిన పదార్థాలు తింటే మందబుద్ధి కలిగ జాగురూకత దెబ్బతింటుందంటారు. తామసిక గుణాలు, అరిషడ్వర్గాలను ఉపవాస జాగరణతో జయిస్తే.. సత్వగుణం లభిస్తుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశిరోజున ఉపవాసం ఉంటే.. ఏడాదిలో 23 ఏకాదశులూ ఉపవాసం చేసిన దానితో సమానమని విష్ణుపురాణం చెబుతోంది.
ఏకాదశిరోజున ఉపవాస వ్రతం చేసేవారు కొన్ని నియమాలను పాటించాలి. దశమిరోజు రాత్రి ఫుల్లుగా తినేసి ఉపవాసం ఉండటం ఉపవాసం చేసినట్లు కానే కాదు. దశమినాడు రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకూడదు. స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండాలి. చెడు పనులు, చెడు ఆలోచనలు వైపు దృష్టి మళ్లకుండా ఉండాలి. వీలైతే ఆహారాన్ని దానం చేయాలి. రాత్రిపూట జాగరణ చేస్తే.. మరింత మంచిది.






