- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nandeeswarudu: నందీశ్వరుడి చెవిలో ఈ విధంగా మీ కోరికలును చెబితే నెరవేరుతాయి..!
శివుడు, నందీ మధ్యలో పొరపాటున కూడా ఎవరూ వెళ్లకూడదని పండితులు చెబుతుంటారు

దిశ, వెబ్ డెస్క్ : దేవుళ్ళకు ఏదొక వాహానం తప్పక ఉంటుంది. మన కళ్ళతో చూస్తే కానీ నమ్మని రోజుల్లో ఏళ్ళ తరబడి కంటికే కనిపించని దేవుళ్ళకు మాత్రం పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించి పూజలు చేస్తున్నాము. ఇదే దైవ మహత్యం. ఈ సృష్టి ఒక మాయ. అసలు పగలు అంత వెలుగు ఎలా వస్తుంది? మళ్ళీ సాయంత్రానికి చీకటి ఎలా అవుతుంది? అంటే మనకి తెలియని .. మనం చూడలేని శక్తులు ఈ భూమి మీదే ఖచ్చితంగా ఉండే ఉంటాయి. అయితే, పురాణాలు శివుడి ( Lord hiva) ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదు అని చెబుతున్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో శివాలయాలు ఉన్నాయి. అలాగే, ప్రతి ఏడాది మహా శివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజున శివుడు ఎన్ని పూజలు అందుకుంటాడో .. ఆయన వాహనమైన నందీశ్వరుడిని కూడా భక్తులు పూజిస్తారు. ఎందుకంటే, నంది చెవిలో చెప్పిన కోరికలు శివుడికి చేరతాయి.
శివయ్య అంటే నందికి ( Nandeeswarudu) చాలా ఇష్టం. ఆ భోళా శంకరుడు నంది భక్తికి మెచ్చి వరం కోరుకొమ్మని అడిగాడట. దానికి మీరు ఎల్లప్పుడు కూడా నా కళ్ళముందే ఉండాలని కోరారంట. దానికి ఈశ్వరుడు కూడా తథాస్తు అని చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. అందు వలన ఎక్కడ శివాలయం అక్కడ ముందు నంది కూడా ఉంటాడు. శివుడు, నందీ మధ్యలో పొరపాటున కూడా ఎవరూ వెళ్లకూడదని పండితులు చెబుతుంటారు. శివుడి ఆలయంలోకి వెళ్లినప్పుడు నందీ చెవిలో వారి కొరికల్ని చెప్పుకుంటారు. అయితే, కోరిక చెప్పేటప్పుడు కొన్ని నియమాల్ని పాటించాలని పండితులు చెబుతున్నారు.
నందీశ్వరుడికి కుడివైపున నిలబడి.. ఆయన రెండు కొమ్ముల మీద.. బొటన వేలు, చూపుడు వేలు ఉంచి, ఎడమ చేయి తోక మీదపెట్టి బొటన వేలు,చూపుడు వేలు మధ్యలో నుంచి శివ లింగాన్ని చూడాలి. ఆ తర్వాత నందీశ్వరుడి కుడి చెవిలో " ఓం " అని ఐదుసార్లు చెప్పిన తర్వాత .. మన కోరికలను నందికి చెబితే.. దాన్ని ముక్కంటి వరకు చేరవేస్తాడని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






