- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Holi Festival: హోలీ పండుగ రోజు ఈ ఒక్క పనిచేస్తే.. ఏడాదంతా డబ్బులే డబ్బులు
హోలీ పండుగను ( Holi Festival ) చిన్నా .. పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : హోలీ పండుగను ( Holi Festival ) చిన్నా .. పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే.. ఈ సారి మార్చి 14న హోలీ పండగను జరుపుకోబోతున్నాం. ఈ క్రమంలోనే హోలీకి ముందు రోజున కాముడు అనే పండుగను నిర్వహించుకుంటారు. ముఖ్యంగా హోలీ రోజున కొన్ని పరిహరాలు చేస్తే .. జీవితంలో వస్తున్న కష్టాలు నుంచి బయట పడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
హోలీ రోజున ఉదయాన్నే తల స్నానం చేసి, పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రోజున కొన్ని ముఖ్యమైన పనులు చేయడం వలన లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పండుగ రోజున పండ్లను దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా.. పేదలకు అన్నదానం కూడా చేయాలి.
వేసవి కాలం మొదలవ్వబోతుంది కాబట్టి పేదలకు గొడుగు, చెప్పులను దానంగా ఇవ్వాలి. అలాగే, ఖాళీ ప్రదేశాలలో కుండలు, చలికేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే .. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడతారు. అదే రోజున హోలీ బియ్యం, నవధాన్యాలను పండితులకు దానంగా ఇవ్వాలంట. ప్రస్తుతం, చాలా మంది రంగుల్ని నీళ్లతో కలిపి వేస్ట్ చేస్తుంటారు. కానీ, అలా చేయోద్దని చెబుతున్నారు.
నీటిని వేస్ట్ చేస్తే వరుణుడి వలన అనేక ఇబ్బందులు వస్తాయి. అలాగే, పేదలకు తీపి పదార్ధాలను దానంగా ఇవ్వాలట. అలాగే, హోలీ రోజున హెయిర్ కట్ చేసుకోవడం, నెయిల్స్ కట్ చేసుకోవడం లాంటివి అస్సలు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.
Read More..
WhatsApp : మీ సీక్రెట్స్ ఇతరులకు తెలియకూడదంటే..? వాట్సాప్‌లో ఇలా చేయండి!!






