TTD: తిరుమల తిరుపతిలో భారీగా తగ్గిన భక్తుల రద్ధీ

by Malleboina Mahesh |

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశంలోని అనేక పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రల వద్ద రద్దీ భారీగా తగ్గిపోయింది.

TTD: తిరుమల తిరుపతిలో భారీగా తగ్గిన భక్తుల రద్ధీ
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశంలోని అనేక పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రల వద్ద రద్దీ భారీగా తగ్గిపోయింది. ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) కూడా ఉంది. నిత్యం వేల మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల తిరుపతిలో రద్దీ తగ్గిపోయింది. మూడు రోజుల క్రితం భక్తులతో కిటకిటలాడిన తిరుమల వీధులు నేడు బోసిపోయాయి. గురువారం తెల్లవారుజామున శ్రీవారి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

దీంతో టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) ప్రకటించారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు తిరుమల శ్రీవారిని 71,001 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,637 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొగా.. భక్తుల (Devotees) నుంచి తిరుమలకు హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు వచ్చింది. కాగా ఆపరేషన్ సిందూర్ కారణంగా తిరుమలకు వెళ్లే భక్తులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు భక్తుల రద్ధీ (Crowd of devotees) భారీగా తగ్గడంతో ఈ సమాచారంతో రేపు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story