- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
by Yella Dhawani Reddy |
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నిత్యం భారీగా భక్తులు (Devotees) కొండకు తరలివస్తుంటారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నిత్యం భారీగా భక్తులు (Devotees) కొండకు తరలివస్తుంటారు. ఆ దేవదేవుడిని కనులారా చూసి పులకించిపోతుంటారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి మరీ ఆ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో బుధవారం కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ నెలకొంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంటన్నీ నిండిపోవటంతో నారాయణ గిరి షేడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. ఇక నిన్న (మంగళవారం) అర్థరాత్రి వరకు శ్రీవారిని 79,467 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,642 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.42 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
Next Story






