- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం నిత్యం భారీగా భక్తులు (Devotees) తరలివస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం నిత్యం భారీగా భక్తులు (Devotees) తరలివస్తుంటారు. ఇక నేటి నుంచి (జులై 25) శ్రావణ మాసం ప్రారంభం కావటంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసంలో శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు సమర్పించుకోవాలని కోరుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తిరుమల కొండపై భక్తుల రద్దీ నెలకొంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక నిన్న (గురువారం) అర్థరాత్రి వరకు శ్రీవారిని 68,800 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,212 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.49 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.






