- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope: నేటి రాశి ఫలాలు(22-10-2025).. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
ఈ రోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంది. అయితే.. మీరు వేసుకున్న ప్రణాళికలను వేరే వాళ్లకు చెప్పడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆఫీసులో ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు.
వృషభ రాశి
ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామితో వాగ్వివాదానికి దిగుతారు. అయినప్పటికీ మీయొక్క ప్రశాంత వైఖరి వలన అన్నిటిని సరి చేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడుపుతారు. ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం ఇష్టదైవాన్ని ఆరాధించండి.
మిథున రాశి
ఈ రాశి వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. మెడ/ వెన్ను లో విపరీతమైన నొప్పితో బాధపడే అవకాశమున్నది. అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఈరోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీస్ లో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
కర్కాటక రాశి
ఆరోగ్య విషయంలో స్నేహితుల సలహాలు కలిసివస్తాయి. ఈ రాశివారికి ఈరోజు డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. మీ సోదరునికి పరిస్థితులను అదుపు చేసుకోవడానికి సహకరించండి. అనవసరమైన తగువులకి చోటివ్వకండి. ప్రేమలో ఎగుడుదిగుడు ను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని కలిగి ఉండండి. ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు.
సింహ రాశి
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. తల్లిదండ్రులను సంతోష పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దడానికి, శుభ్రపరుచుటకు ప్రణాళిక రూపొందిస్తారు. కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు.
కన్య రాశి
ఈ రాశివారికి సోదరుల సహాయం మానసిక సంతృప్తినిస్తుంది. మీ ఆహారం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఖాళీగా ఉండటం వల్ల మానసిక అశాంతికి గురిచేస్తోంది. కాబట్టి ఏదైనా పనిలో నిమగ్నమవండి. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చు. అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.
తులా రాశి
ఈ రోజు దగ్గరి వారితోనే గొడవలు జరిగే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిత్వం వల్ల కొత్త స్నేహితులను పొందడానికి సహాయ పడతాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. విద్యార్థులు సమయాన్ని వృధా చేస్తారు. వైవాహిక జీవితం బాగుంది.
వృశ్చిక రాశి
మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీని వలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీ బంధువుల దగ్గరకి వెళ్లడం మీరు ఊహించిన దానికన్నా బాగుటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనూకులంగా ఉండదు. మీ సహుద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. ఈరోజు ఆఫీసు నుండి వచ్చిన తరువాత మీరు మీయొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు.
ధనుస్సు రాశి
మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి ఢోకా ఉండదు. కుటుంబ టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చెయ్యనివ్వకండి. ఈ సమయం వృధా కాకుండా, జీవిత పాఠాలను నేర్చుకొండి. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు. వైవాహిక జీవితం బాగుంటుంది.
మకర రాశి
ఈ రాశివారికి అవసరానికి డబ్బు అందకపోవడంతో నిరాశాకు గురవుతారు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి.
కుంభ రాశి
ఈ రోజు వీరికి ఒత్తిడి పెరుగుతుంది. అయోమయం, నిరాశ నిస్పృహలను నుంచి దూరంగా ఉండండి. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీ పనిపై ధ్యాస పెడితే రెట్టింపు లబ్దిని పొందగలరు. డబ్బు,ప్రేమ, కుటుంబం గురించి అతిగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోతారు.
మీన రాశి
ఈ రోజు ప్రయాణాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. అనుకోని బహుమతులు బంధువులు, స్నేహితుల నుంచి అందుతాయి. మీరు చేసిన పనులకు, మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. ఈ రోజు, మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి. వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలూ చాలా ఆనందంగా గడుస్తాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఇష్టదైవాన్ని ఆరాధించండి.






