తిరుమలలో వీకెండ్ రష్ షురూ.. శిలాతోరణం వరకూ క్యూలైన్!

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

తిరుమలలో వీకెండ్ రష్ షురూ.. శిలాతోరణం వరకూ క్యూలైన్!
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం 7 గంటల సమయానికి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులో ఉన్న కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా.. శిలాతోరణం వరకూ క్యూలైన్లో వేచి ఉన్నారు. టోకెన్ లేకుండా.. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల తర్వాతి నుంచి వెళ్లే భక్తులకు.. శ్రీవారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వెల్లడించారు. రూ.300 శీఘ్రదర్శనానికి 4-6 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందినవారికి 5-8 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు.

నిన్న (శుక్రవారం) స్వామివారిని 74,128 మంది భక్తులు దర్శించుకోగా.. 36,053 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు రాగా.. 3.98 లక్షల లడ్డూలను విక్రయించారు. 2.75 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు.

Next Story