- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్.. తిరుపతిలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల శ్రీవారిని ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు. పండుగ సీజన్, అలాగే హాలీడేస్ కావడంలో కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ అమాంతం పెరిగి పోయిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు. పండుగ సీజన్, అలాగే హాలీడేస్ కావడంలో కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ అమాంతం పెరిగి పోయిన విషయం తెలిసిందే. తాజాగా, సెలవులు ముగియడంతో నేడు గురువారం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిందని సమాచారం. శ్రీవారి దర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని 65,422 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 23,778 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.3.30 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది.
- Tags
- tirupati
Next Story






