- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం వీరి నుంచి ఆహారం అస్సలు తీసుకోకండి?
గరుడ పురాణం ప్రకారం, మనం పాపుల నుంచి ఆహారాన్ని స్వీకరిస్తే, వారి పాపాలలో మనం కూడా పాలుపంచుకుంటాము

దిశ, వెబ్ డెస్క్ : గరుడ పురాణం ప్రకారం, మనం పాపుల నుంచి ఆహారాన్ని స్వీకరిస్తే, వారి పాపాలలో మనం కూడా పాలుపంచుకుంటాము. అయితే ఎవరి నుంచి ఆహారం తీసుకుంటే మనకూ ఎలాంటి పాపం తగులుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
నేరస్థులు నుంచి ఒకవేళ మీరు ఆహారం తీసుకుంటే..
గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి న్యాయస్థానంలో లేదా చట్టం ద్వారా దోషి అని నిర్దారణ అయితే వారి నుంచి ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అన్యాయం చేసిన వ్యక్తి చేతి నుంచి ఏదయిన తాకితే మనం కూడా ఆ పాపంలో పాలుపంచుకున్నట్లేనట. దాని వల్ల మనకి అంతా చెడు జరుగుతుందట.
వడ్డీ వ్యాపారుల నుంచి మీరు ఏదయినా తీసుకుంటే ఇక మీ పని అంతే..
ప్రస్తుత కాలంలో చాలామంది వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు నుంచి ఏదయినా తీసుకుంటే చాలా పాపం అంట. వారి దగ్గర మంచి నీళ్లు కూడా తీసుకోకూడదని గరుడ పురాణం చెబుతోంది.
- Tags
- Garuda Puranam






