- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gajakesari yogam: గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు.. మీ రాశి ఉందా?
కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనేక మార్పులను తెస్తాయి

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో (Astrology) గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి. కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనేక మార్పులను తెస్తాయి. అన్ని యోగాలలో గజకేసరియోగం ( Gajakesari yogam) శక్తివంతమైనది. ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఈ యోగం మనిషి జీవితం మీద ప్రభావితం చేస్తుంది. అలాగే, వారి లైఫ్ పూర్తిగా మారిపోతుంది. బిచ్చగాడు కూడా ధనవంతుడు అవుతాడు. అన్ని ఆంటకాలు తొలగిపోయి.. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుంది. అయితే.. ఈసారి హోలీకి ముందు ఏర్పడుతుంది. ఈ పండుగ మార్చి 14న జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలోనే గజకేసరి యోగం మార్చి 6వ తేదీన ఏర్పడబోతుంది. దీని వలన రెండు రాశుల రాశుల వారికి భారీగా ధనలాభంతో పాటు, ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మీన రాశి ( Meena rasi )
గజకేసరి యోగం ( Gajakesari yogam)వలన మీన రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. కోర్టు సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. అలాగే, మీరు పని చేస్తున్న ఆఫీసులో వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
ధనస్సు రాశి ( Dhanasu rasi)
గజకేసరి యోగం ( Gajakesari yogam)వలన ధనస్సు రాశి వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. భారీగా ధన లాభాలు వస్తాయి. మీరు సొంతింటి కల సాకారం అవుతుంది. ఉన్నత చదువుల కోసం ఇతర విదేశాలకు వెళ్తారు. ఈ సమయంలో కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






