- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026లో నాలుగు రాజయోగాలు.. మూడు రాశులవారికి లక్కే లక్కు
మరో వారంరోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. న్యూ ఇయర్ వేడుకలకు అందరూ సిద్ధమవుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మరో వారంరోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. న్యూ ఇయర్ వేడుకలకు అందరూ సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సరంలో తమ రాశికి ఎలా ఫలితాలు ఉండబోతున్నాయోనని తెలుసుకోవాలన్న ఆరాటం చాలామందికి ఉంటుంది. 2026ల ఏకంగా నాలుగు రాజయోగాలు ఏర్పడనుండగా.. మూడు రాశులవారి జీవితం ఊహించని విధంగా మారబోతోందని పండితులు చెప్తున్నారు. అదృష్టం, విజయంతో పాటు శ్రేయస్సు కలుగుతుందని తెలుపుతున్నారు.
కొన్ని గ్రహాల కలయికతో నూతన సంవత్సరంలో అతిశక్తివంతమైన మాలవ్య రాజయోగం, బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య, గజకేసరి రాజయోగం ఏర్పడనున్నాయి. వీటి ప్రభావం 12 రాశులపైనా ఉండనుండగా.. 3 రాశులవారికి ఊహించని రీతిలో ఫలితాలను ఇవ్వనున్నాయి.
వృషభరాశి
ఈ రాశివారికి నాలుగు రాజయోగాల వల్ల అకస్మాత్తుగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు రావడం, కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకు రావడం వంటివి జరుగుతాయి. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే కానుంది. పాత అప్పులు తీర్చి సంతోషంగా గడుపుతారు.
మిథున రాశి
ఈ రాశివారికి కూడా 2026 అద్భుతంగా ఉండనుంది. ఈ ఏడాదిలో ఏర్పడే రాజయోగాలతో కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ఇల్లు లేదా కారును కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.
తులారాశి
నాలుగు రాజయోగాల వల్ల తులారాశి వారి జీవితమే ఊహించని విధంగా మారిపోబోతోంది. 2026 ఈ రాశివారికి చాలా లక్కీ అని చెప్తున్నారు. 2026లో వీరు ఆర్థికంగా బలంగా తయారవుతారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. నూతన ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.






