2026లో తొలి చంద్రగ్రహణం అప్పుడే..

by Naga Rani Yarlagadda |

సనాతన సంప్రదాయంలో, సూర్య మరియు చంద్ర గ్రహణాలు రెండింటినీ ..

2026లో తొలి చంద్రగ్రహణం అప్పుడే..
X

దిశ, వెబ్‌డెస్క్: సనాతన సంప్రదాయంలో, సూర్య మరియు చంద్ర గ్రహణాలు రెండింటినీ అశుభ సంఘటనలుగా పరిగణిస్తారు. గ్రహణాల సమయంలో శుభకార్యాలు అస్సలు చేయరు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. 2026 కొత్త సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు.

నూతన సంవత్సరంలో భారతదేశంల ఒకే ఒక చంద్రగ్రహణం కనిపిస్తుంది. దీని సూతక కాలం మాత్రమే ఇక్కడ చెల్లుతుంది. ఫిబ్రవరి 17న మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3.26 గంటల నుంచి సాయంత్రం 7.57 గంటల వరకు ఉంటుంది. కానీ ఇది భారత్ లో కనిపించదు. ఈ గ్రహణం యొక్క ప్రభావం జింబాబ్వే, దక్షిణాఫ్రికా, టాంజానియా, జాంబియా, మారిషస్, అంటార్కిటికా మరియు దక్షిణ అమెరికాపై ఉంటుంది. ఆగస్టు 12న రెండో సూర్యగ్రహం ఏర్పడుతుంది. ఇది కూడా భారత్ లో కనిపించదు. యూరప్, కెనడా, గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఆర్కిటిక్ ప్రాంతం, ఉత్తర స్పెయిన్, అట్లాంటిక్ మహాసముద్రం, ఈశాన్య రష్యా, వాయువ్య ఆఫ్రికా, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది.

చంద్రగ్రహణాల విషయానికొస్తే.. మార్చి 3న తొలి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు గ్రహణం ఉంటుది. ఈ గ్రహణం భారత్ లో కనిపిస్తుంది కాబట్టి దీని సూతకకాలం చెల్లుతుంది. ఆ రోజు ఉదయం 6.20 గంటలకు సూతకకాలం ప్రారంభమవుతుంది. ఆగస్టు 28, శుక్రవారం నాడు సంభవిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల, సుతక్ కాలం చెల్లదు. ఈ చంద్రగ్రహణం ఉదయం 8:04 నుండి రాత్రి 11:22 వరకు ఉంటుంది. ఈ గ్రహణం ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా, షార్జా, ఇండో-పసిఫిక్ , ఉత్తర - దక్షిణ అమెరికా, యూరప్‌లోని ఎక్కువ భాగం మరియు నైరుతి ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.

Next Story