- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వర్షాలు తగ్గముఖం పట్టాయి. గత రెండు రోజులుగా స్యూర భగవానుడు కూడా దర్శనిమిస్తున్నాడు. అయినప్పటికీ పలు చోట్ల నది, వాగులు, వంకలు పొంగిపొర్లటం తగ్గలేదు. ఈ క్రమంలో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ (Edupayala vanadurgamma) ఆలయం గత తొమ్మిది రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో సింగూర్ నుంచి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో వనదుర్గ ఆనకట్ట నుంచి 42,800 క్యూసెక్కుల వరద నీరు పొంగిపొర్లుతోంది. గర్భగుడి ముందున్న మూడు పాయలు కలిసి ఒకే పాయగా, గుడి వెనుక ఉన్న నాలుగు పాయలు కలిసి ఒకే పాయగా మంజీర నది ప్రవహిస్తోంది. పూజారులు ప్రధాన ఆలయాన్ని మూసి వేసి రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. వనదుర్గ ఆనకట్టవైపు, గర్భగుడి వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు.






