- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎగ్జామ్స్ ఎఫెక్ట్.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంటోంది. గురువారం ఉదయానికి ఉచిత దర్శనం కోసం 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంటోంది. గురువారం ఉదయానికి ఉచిత దర్శనం కోసం 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేని వారికి స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు 3 నుంచి 5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పట్టనుంది. నిన్న (బుధవారం) స్వామివారిని 73,652 మంది భక్తులు దర్శించుకోగా 25,758 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
సర్వభూపాల వాహనంపై బకాసురవధ అలంకారంలో..
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసురవధ అలంకారంలో సర్వభూపాలవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు మాడ వీధుల్లో విహరించి అభయమిచ్చారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కన్నులపండువగా జరిగింది. భక్తులు అడుగడుగునా కల్యాణ వేంకటేశ్వరుడికి హారతులు పట్టి ఆశీస్సులు పొందారు.






