ఆలయాలకు కార్తీక సోమవారం శోభ.. ఉదయాన్నే పోటెత్తిన భక్తులు

by Malleboina Mahesh |

ఈ రోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామున నుంచే ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది.

ఆలయాలకు కార్తీక సోమవారం శోభ.. ఉదయాన్నే పోటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: కార్తీక మాసం (Karthika masam) ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కార్తీక మాసంలో వచ్చిన మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామున నుంచే ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. కార్తీక సోమవారం పవిత్ర దినం గా భావించిన భక్తులు గంగా స్నానం చేసి, భక్తి భావంతో శివాలయాలు, విష్ణుమందిరాలను దర్శించుకున్నారు. ప్రత్యేకంగా కాశీ విశ్వనాథ, శ్రీశైలం, కాళహస్తి, దుర్గగుడులు, స్థానిక శివాలయాల్లో భారీగా భక్తులు తాకిడి చేశారు. అలాగే నగరంలోని అన్ని దేవాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

కుటుంబ సమేతంగా ఆలయాలకు వచ్చిన భక్తులు పరమేశ్వరునికి పాలు, తేనె, బెల్లం, నీరు, బిల్వదళాలతో అభిషేకాలు నిర్వహించారు. అనేక ఆలయాలలో దేవాలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్‌లు, తాగునీటి సదుపాయాలు, భోజన ప్రసాదం వంటివి అందుబాటులో ఉంచారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతతో నిండిన కార్తీక సోమవారం రాష్ట్రమంతా ఉత్సాహంగా కొనసాగుతోంది.

Next Story