Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి బారులు తీరిన భక్తులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-07 03:37:08  IST  )

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి బారులు తీరిన భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 3-5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న (శుక్రవారం) స్వామివారిని 67,085 మంది దర్శించుకున్నారు. 24,832 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3.78 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.

Next Story