తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

by Naga Rani Yarlagadda |

వరుస సెలవులతో నాలుగు రోజులుగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేటి ఉదయానికి భక్తుల రద్దీ సగానికి సగం తగ్గింది.

తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస సెలవులతో నాలుగు రోజులుగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేటి ఉదయానికి భక్తుల రద్దీ సగానికి సగం తగ్గింది. బుధవారం ఉదయం 18 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3-5 గంటలు, టోకెన్లు లేని భక్తులకు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (మంగళవారం) స్వామివారిని 77,049 మంది భక్తులు దర్శించుకోగా.. 21,469 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Next Story