తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం స్వల్పంగా తగ్గింది. ఉదయానికి శ్రీవారిని దర్శించుకునేందుకు 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. సర్వ దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం స్వల్పంగా తగ్గింది. ఉదయానికి శ్రీవారిని దర్శించుకునేందుకు 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. సర్వ దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు లేని భక్తులకు ఉచిత దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని పేర్కొంది. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న స్వామివారిని 74,192 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 22,313 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4.57 కోట్లు వచ్చినట్లు తెలిపారు.

Next Story