- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 11 కంపార్టుమెంట్లలో భక్తులు
by Naga Rani Yarlagadda |
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో చాలా రోజుల తర్వాత భక్తుల రద్దీ సాధారణంగా కనిపిస్తోంది. గురువారం ఉదయం 8 గంటల సమయం వరకూ.. శ్రీవారి దర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కొత్త క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు రద్దీని బట్టి దర్శన సమయాలు మారుతాయని తెలిపారు. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 3-5 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు.
నిన్న (బుధవారం) 71,029 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 31,184 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.
Next Story






