- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు ఉన్న భక్తులకు 3-5 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొంది.
సోమవారం 71,208 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 23,135 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి భక్తులు హుండీ సమర్పించిన కానుకలు రూ.3.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
ఈరోజు ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండి భేటీ కానుంది. ఈ సమావేశంలో వైకుంఠ ద్వారదర్శనాల టోకెన్ల జారీపై కీలక చర్చ జరగనుంది. డిసెంబర్ 30న వైకుఠం ఏకాదశి కావడంతో.. 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారదర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది.






