- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు
by Naga Rani Yarlagadda |
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి.. భక్తులు స్వామివారి దర్శనం కోసం శిలాతోరణం (Sila Thoranam) వరకూ క్యూలైన్లో వేచి ఉన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి.. భక్తులు స్వామివారి దర్శనం కోసం శిలాతోరణం (Sila Thoranam) వరకూ క్యూలైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇప్పటి నుంచి క్యూలైన్లోకి వెళ్లేవారికి 15-20 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 6 గంటలు, రూ.300 శీఘ్రదర్శనమునకు 4 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న స్వామివారిని 68,095 మంది భక్తులు దర్శించుకోగా.. 23,932 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చింది.
Next Story






