తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం అంటే..

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం అంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటల్లో దర్శనం జరుగుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి దర్శనం 12 గంటల్లో జరుగుతుందని వెల్లడించింది. రూ.300 శ్రీఘ్రదర్శనానికి 3 గంటల సమయం పడుతుందని పేర్కొంది.

సోమవారం 66,322 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా.. 26 వేల మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Next Story