Tirumala: వైకుంఠద్వార దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ

by Naga Rani Yarlagadda |

తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది.

Tirumala: వైకుంఠద్వార దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. టోకెన్లు లేకుండా డైరెక్ట్ గా సర్వదర్శనం కల్పిస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండి శిలాతోరణం వరకూ క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లోకి వెళ్తున్న భక్తులకు.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. రూ.300 శ్రీఘ్రదర్శనంకు వెళ్లేవారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుందని తెలిపింది.

రూముల్లేక భక్తుల ఇబ్బందులు

నిన్న (శుక్రవారం) స్వామివారిని 83,032 మంది భక్తులు దర్శించుకోగా.. 27,372 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం భక్తులు వివిధ కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా.. తిరుమల కొండపై భక్తుల రద్దీ భారీగా ఉండటంతో రూమ్స్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు. వారికి అన్నప్రసాదానికి లోటు లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తుల రద్దీ ఎక్కుగా ఉన్న ప్రాంతాల్లో మూడు పూటలు అన్నప్రసాదం, పిల్లలకు పాలు అందించేలా ఏర్పాట్లు చేసింది.

Next Story