తిరుమలకు పొటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

by Yella Dhawani Reddy |

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)కు భక్తులు పోటెత్తారు.

తిరుమలకు పొటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)కు భక్తులు పోటెత్తారు.శుక్రవారం టోకెన్లు లేని భక్తుల (Devotees) దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అలాగే క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. గురువారం స్వామివారిని 69,019 మంది భక్తులు దర్శించుకోగా.. అందులో 37,774 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Next Story