తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటల సమయం

by Kema Shiva Kumar |

భక్తుల కొంగుబంగారం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: భక్తుల కొంగుబంగారం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గురువారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగానే తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 24 పైగా గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 6 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. గురువారం స్వామి వారిని 59,834 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,628 మంది భక్తలు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.49 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Next Story