తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్ధీ

by Malleboina Mahesh |

గత వారం రోజులుగా తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఈ రోజు కాస్త తగ్గింది.

తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్ధీ
X

దిశ, వెబ్ డెస్క్: గత వారం రోజులుగా తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఈ రోజు కాస్త తగ్గింది. గురువారం తెల్లవారుజామును స్మామివారిని దర్శించుకునేందుకు 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివుండగా, టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో అన్ని వైపులా భక్తుల రద్దీ పెరిగి, క్యూలైన్లు కిక్కిరిసిపోయిన పరిస్థితి నెలకొంది. టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యార్థం అదనపు సిబ్బందిని నియమించి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా నిన్న ఒక్కరోజే 72,283 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 22,583 మంది తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల కొండ అంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. అయితే చలి తీవ్ర అధికం కావడంతో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పెరిగిన చలికి తగ్గట్టుగా భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

Next Story