- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. అతి తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం
by Naga Rani Yarlagadda |
దసరా సెలవులు మొదలైనా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గడం విశేషం.

X
దిశ, వెబ్‌డెస్క్: దసరా సెలవులు మొదలైనా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గడం విశేషం. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలపై భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కానీ మంగళవారం (సెప్టెంబర్ 23) మాత్రం భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి స్వామివారి దర్శనం 8 గంటల్లో జరుగుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3-5 గంటలు, రూ.300 శీఘ్ర దర్శనానికి 1-3 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.
నిన్న (సోమవారం) స్వామివారిని 60,681 మంది భక్తులు దర్శించుకోగా.. 19,510 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
Next Story






