తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 6 కంపార్టుమెంట్లలో భక్తులు

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం 7 గంటల వరకూ స్వామివారి సర్వదర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 6 కంపార్టుమెంట్లలో భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం 7 గంటల వరకూ స్వామివారి సర్వదర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు పొందిన భక్తులకు 3-4 గంటల్లో దర్శనం జరుగుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని పేర్కొంది. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. ఆదివారం శ్రీవారిని 84,442 మంది భక్తులు దర్శించుకోగా.. 24,692 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చింది.

Next Story