- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. భూదేవి కాంప్లెక్సు వద్ద క్యూలైన్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎదురుచూస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పూజలందుకుంటూ.. తిరుమల ఏడుకొండలపై కొలువై ఉన్న ఆ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివెళ్తున్నారు. ప్రతిరోజూ వేలాది మంది శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి ఉచిత సర్వదర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8-10 గంటల సమయం పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-4 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. నిన్న (శనివారం) 82,040 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31,606 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకోగా.. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.18 కోట్లు సమకూరింది. మరోవైపు అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్సులో రేపటి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు క్యూ కట్టారు. అటు విష్ణునివాసం, శ్రీవారి మెట్టు, శ్రీనివాసం వద్ద కూడా భక్తులు టోకెన్ల కోసం ఎదురుచూస్తున్నారు.






