- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో వీకెండ్ రష్.. సర్వ దర్శనానికి పోటెత్తిన భక్తులు
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేని వారికి స్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని పేర్కొంది. రూ.300 శీఘ్రదర్శనానికి 2 నుంచి 4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.
నిన్న (గురువారం) స్వామివారిని 60,896 మంది భక్తులు దర్శించుకోగా.. 23,077 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం స్వామివారికి భక్తులు వివిధ కానుకలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. కాగా.. ఈరోజు ఉదయం 11 గంటలకు 2026 జనవరి నెల శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం, వసతి కోటా బుకింగ్ ఓపెన్ కానుంది. అలాగే 2026 జనవరి నెలకు గాను సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల దర్శనం కోటా టికెట్ల బుకింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.






