- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
by Yella Dhawani Reddy |
వరుస సెలవులు, వారాంతం కావటంతో తిరుమలకు (Tirumala) భక్తులు (Devotees) పోటెత్తారు. దీంతో శనివారం (ఆగస్టు 16) శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లన్నీ నిండిపోయి బయట ఆక్టోపస్ భవనం వరకు వేచి ఉన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు, వారాంతం కావటంతో తిరుమలకు (Tirumala) భక్తులు (Devotees) పోటెత్తారు. దీంతో శనివారం (ఆగస్టు 16) శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లన్నీ నిండిపోయి బయట ఆక్టోపస్ భవనం వరకు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (ఆగస్టు 15) స్వామివారిని 77,043 మంది భక్తులు దర్శించుకోగా, 41,859 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story






