Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Yella Dhawani Reddy |

వేసవి సెలవుల కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తులు పోటెత్తారు.

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవుల కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా విద్యాసంస్థల సెలవులు ముగిసే సమయం రావడంతో పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుపతి కొండపై భక్తులు కిటకిటలాడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండి బయట క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. ఇక సోమవారం అర్థరాత్రి వరకు ఏడుకొండలవాడిని 83,542 మంది భక్తులు దర్శించుకోగా, 34,265 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.11 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story