- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!
ప్రముఖ ఆధ్మాత్మక పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 66,606 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శ కొంత వేగంగానే పూర్తవుతున్నప్పటికీ, సాధారణ భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్లు నిండిపోయాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న ఒక్కరోజే 66,606 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకోవడానికి 25,899 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు తమ భక్తిని కానుకల రూపంలో సమర్పించగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఎండాకాలం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, భక్తులు తగిన ఏర్పాట్లతో రావాలని టీటీడీ సూచిస్తోంది.






