తిరుమల తిరుపతి లో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు

by Malleboina Mahesh |

తిరుమలలో భక్తుల రద్దీ! 20 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు.

తిరుమల తిరుపతి లో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు
X

దిశ, వెబ్ డెస్క్: వెసవి సెలవులు ప్రారంభం అవుతుండటంతో తమ పిల్లలతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో సోమవారం ఉదయం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల తాకిడి సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉండటంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం కూడా పెరిగింది. టైమ్ స్లాట్ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (Free Darshan) కోసం సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే నిన్న ఆదివారం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో నిన్న ఒక్కరోజే మొత్తం 83,271 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న వారిలో 25,018 మంది భక్తులు కళ్యాణ కట్ట లో తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ. 3.78 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు మరియు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఓపికతో అధికారులకు సహకరించి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

Next Story