తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

by Malleboina Mahesh |

తిరుమలలో క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: గత నెలరోజులుగా తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ (Crowd of devotees) కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం తెల్లవారుజామున కూడా తిరుమల కొండపైకి భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోవడంతో, టోకెన్లు లేని సాధారణ భక్తులు క్యూ కాంప్లెక్స్ వెలుపల కిలోమీటర్ల మేర లైన్లో వేచి ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (Sarvadarsanam) లభించడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది.

ఇదిలా ఉంటే నిన్న ఒకే రోజే స్వామివారిని మొత్తం 86,124 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే కల్యాణకట్టలో 41,520 మంది భక్తులు స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకుని తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ. 3.51 కోట్లుగా నమోదైంది. క్యూలైన్లలో వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నందున, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లలోనే నిరంతరాయంగా మంచినీరు, పాలు, అన్నప్రసాద వితరణ సౌకర్యాలను టీటీడీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

Next Story