- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
by Kema Shiva Kumar |
ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఇటీవల కార్తీక మాసం ముగియడం వివిధ రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తుల రాక స్వల్పంగా తగ్గింది. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 2 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 78,974 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.61 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.
Next Story






