తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

by Malleboina Mahesh |

తిరుమలలో భక్తుల రద్దీ! శ్రీవారి సర్వదర్శనానికి 6-10 గంటల సమయం. నిన్న 79,426 మందికి దర్శనం.. హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల కొండపై కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల గిరులు భక్త జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్ ఫలితాలు రావడంతో పాటు రవాణా వ్యవస్థలు గతంలో కంటే మెరుగ్గా ఉండటం తో నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకోగా, నేడు కూడా అదే స్థాయిలో రద్దీ కొనసాగుతోంది.

బుధవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 23 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో సర్వదర్శనం (టోకెన్ లేని భక్తులు) కోసం వేచి ఉన్న వారికి సుమారు 6 నుండి 10 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరం మంచినీరు, అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం 79,426 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,889 మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.98 కోట్ల ఆదాయం లభించింది.

ముఖ్య గమనిక - మే 1 నుంచి మార్పులు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని మే 1వ తేదీ నుంచి టీటీడీ కీలక మార్పులు చేయనుంది. భక్తులకు మరింత ఉపశమనం కలిగించేలా దర్శన సమయాల్లో మార్పులు, వీఐపీ బ్రేక్ దర్శనాలపై నియంత్రణ ఉండొచ్చని అధికారులు సూచిస్తున్నారు.

Next Story