Tirumala: శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల విక్రయాల్లో గందరగోళం

by Yella Dhawani Reddy |

రద్దీ అధికంగా ఉండటంతో రాత్రి స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.

Tirumala: శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల విక్రయాల్లో గందరగోళం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala) ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల (Devotees) కోసం టీటీడీ (TTD) శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శన టికెట్లను విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, గతంలో శ్రీవాణి టికెట్లను సైతం ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేవారు. కానీ, ఇప్పుడు అలా లేదు.. ఏ రోజు టికెట్లు ఆ రోజే అందజేస్తున్నారు. ఉదయం టికెట్ల జారీ ఉంటే.. సాయంత్రం శ్రీవాణి టికెట్ దర్శనం ఉంటుంది. ఈ క్రమంలో శనివారం శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొంది. ఉదయం 10.30 గంటలకు టికెట్లు జారీ చేస్తామని టీటీడీ ముందుగానే ప్రకటించింది. వారాంతం కావటంతో తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే టికెట్ల విక్రయాలు ప్రారంభించారు అధికారులు. రద్దీ అధికంగా ఉండటంతో రాత్రి స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు టికెట్లు దొరకని భక్తులు అన్నమయ్య భవనం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ విజిలెన్స్‌ అధికారులు వారికి సర్దిచెప్పి వారిని వెనక్కి పంపించారు.

Next Story