- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంత వచ్చిందంటే?
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో గురువారం ఆలయ అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్:తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి (Komuravelli) మల్లన్న స్వామి ఆలయంలో గురువారం ఆలయ అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 48 రోజుల్లో స్వామివారి హుండీ ఆదాయం (Hundi income) రూ.90,09,170 వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు. అలాగే, 96 గ్రాముల మిశ్రమ బంగారం, 9 కిలోల 50 గ్రాముల మిశ్రమ వెండి, 22 నోట్లు విదేశీ కరెన్సీ, 14 క్వింటాళ్ల బియ్యం వచ్చినట్లు వెల్లడించారు. ఆలయంలోని 24 హుండీల ద్వారా లభించిన నగదును స్థానిక SBI బ్యాంకులో జమ చేసినట్లు చెప్పారు.
ఇక వేసవి సెలవులు నేపథ్యంలో మల్లన్న దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.






