100 సంవత్సరాలకు వస్తోన్న బుధాదిత్య రాజయోగం.. ఈ మూడు రాశులవారికి అదృష్టం, సుఖసంతోషాలు

by Naga Rani Yarlagadda |

మకర సంక్రాంతి పర్వదినం రోజున.. జనవరి 14న బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అంటే సూర్యుడు బుధుడు మకరరాశిలో కలిసి రాజయోగాన్ని సృష్టిస్తారు.

100 సంవత్సరాలకు వస్తోన్న బుధాదిత్య రాజయోగం.. ఈ మూడు రాశులవారికి అదృష్టం, సుఖసంతోషాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాలలో ప్రధాన గ్రహాలు ఏదొక పండుగ లేదా గ్రహణ సమయాల్లో శుభయోగాలను ఇస్తాయి. ఇవి కొన్ని రాశుల్లో పుట్టిన వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ఏడాది మకరసంక్రాంతి పర్వదినం రోజున.. అంటే జనవరి 14న బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అంటే సూర్యుడు బుధుడు మకరరాశిలో కలిసి రాజయోగాన్ని సృష్టిస్తారు. ఇది 100 సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది. ఈ రాజయోగం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తోంది. ఆకస్మిక ఆర్థిక లాభం, జీవితంలో పురోగతి అదృష్టాలను అందించనుంది.

జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని ఆత్మవిశ్వాసం, నాయకత్వం, గౌరవానికి కారకంగా పరిగణిస్తారు. బుధుడు.. తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపార వృద్ధిని ఇస్తాడని చెప్తారు. ఈ రెండు గ్రహాల కలయిక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని, విజయం సాధించే సామర్థ్యాన్ని పెంచుతుంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏర్పడుతున్న ఈ రాజయోగం ఏయే రాశులకు ప్రయోజనం చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి

మేషరాశికి అదృష్ట గృహంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఇది వారి అదృష్టాన్ని బలపరుస్తుంది. ఈ సమయంలో పూర్తికాని పనులను పూర్తి చేయవచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ పర్యటనకు కూడా అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం కలుగుతుంది. మతపరమైన లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని మరింత ముందుకు సాగేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి.

కన్యారాశి

బుధుడు ఈ రాశికి అధిపతి. రాశ్యాధిపతి సూర్యుడితో కలిసి ఏర్పరిచే బుధాదిత్య రాజయోగం సుఖం, సౌకర్యానికి నిలయంగా మారుతోంది. దీనివల్ల ఇల్లు, వాహనాల కొనుగోలు లేదా ఆస్తి సంబంధిత విషయాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని, పెట్టుబడుల కోసం చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీరు తీసుకునే సరైన నిర్ణయాలతో కుటుంబంతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి.

కుంభరాశి

బుధాదిత్య రాజయోగం.. కుంభరాశివారి జాతకచక్రంలో లాభదాయక గృహంలో ఏర్పడుతోంది. ఇది కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుంది. ఫలితంగా సంపాదన పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి లాభం పొందే అవకాశాలున్నాయి. స్నేహితులు, బంధువుల మద్దతు పని పురోగతికి సహాయపడుతుంది. కొత్త పరిచయస్తులు, పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనాలను అందిస్తాయి. స్టాక్ మార్కెట్, ఇతర పెట్టుబడుల విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మెంటల్ స్టెబిలిటీని కాపాడుకోవడం మీకు ప్లస్ పాయింట్ అవుతుంది.

గమనిక : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ప్రకారం ఈ జ్యోతిష్య ఫలితాలను అందిస్తున్నాం. వీటిని నమ్మాలని "దిశ" సూచించదు. ఇందుకు "దిశ" ఎలాంటి బాధ్యత వహించదు.

Next Story